తూ.గో.జిల్లా అంకంపాలెంలో మాలలు దాడికి గురైనపుడు దళిత మహాసభతో
చేయి కలిపి, బాధితుల్ని ఆదుకుంది జైభారత్. కడప జిల్లా టి. కొత్తపల్లిలో
మాదిగల పైన దాడిజరిగినపుడు ప్రతిఘటన పోరాటాన్ని నిర్మించింది
. భాదితులకు ఆశ్రయాన్ని కల్పించింది. న్యాయపోరాటం చేసింది జైభారత్.
తూ.గో. జిల్లా పోట్టిలంకలో మాలలపై దాడి జరిగినప్పుడు భాదితుల్ని
ఆదుకున్నది. ఉమ్మడి పోరాటంలో చురుకైన పాత్ర పోషించింది జైభారత్.
విశాక జిల్లా కొడవడిపూడి మాలలపై దాడి జరిగినపుడు భాదితులకు
అండగా నిలిచింది, ఆదుకున్నది, పోరాట పథంలో నడిపించింది జైభారత్.
ఇంకా మెదక్ జిల్లా కోడూరులో, ఆదిలాబాద్ జిల్లా ముల్కల్లలో, గుంటూరు
జిల్లా అమృతలూరులో, తూ.గో.జిల్లా గూడవల్లిలో, కడప జిల్లా
జమ్మలమడుగులో...రాష్ట్రంలో దళితుల పైన అన్యాయాలు, దాడులు జరిగిన
అనేకానేక సందర్బాలలో భాదితులకి అండగా నిలిచింది జైభారత్.
ఒక పక్క దళితులపై దాడులు నానాటికీ పెరిగిపోతున్న ఉద్రిక్త
సమయంలో, మరోపక్క దళిత సంస్థలు అగ్రకుల శక్తుల ముందు
సాగిలపడుతున్న విషమ ఘడియల్లో, దాడుల్ని వ్యతిరేకిస్తూ, తొడగొట్టి
బరిలో నిలిచి 17 జిల్లా కేంద్రాల్లో వేలాది ప్రజానీకాన్ని సమీకరించి..
సాహసోపేతంగా రాష్ట్రవ్యాప్తంగా 'నిరసన దినాన్ని' అమలు జరిపి,
అగ్రకులాహంకారానికి సవాల్ విసిరింది జైభారత్.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి