ప్రజపోరాటలకు మద్దతుగా : ఎన్నెన్నో ప్రజాస్వామిక పోరాటాలకి మద్దతు
కూడగట్టింది, అండగా నిలిచింది జైభారత్. వామపక్షాల భూపోరాటం పైన
దమనకాండను నిరసిస్తూ ఉద్యమించి అరెస్టులను ఎదుర్కున్నారు జైభారత్
కార్యకర్తలు. ఎన్టిపీసి కార్మికుల పోరాటాన్ని బలపరిచింది జైభారత్. వాకపల్లి
గిరిజన స్త్రీలపై పోలీస్ అత్యాచారాలను ప్రతిఘటిస్తూ రాష్ట్రవ్యాప్తంగా సాగిన
అఖిల పక్ష ఉద్యమంలో చురుకుగా పాల్గొనడమే కాదు, ఈ పోరాటానికి అనేక
జిల్లాల్లో నాయకత్వం వహించింది జైభారత్. వికలాంగుల ఉద్యమానికి, మద్య
వ్యతిరేక ఉద్యమానికి, ఎస్టీ వర్గీకరణకు, తెలుగుభాషోద్యమానికి మద్దతు
అందించింది. ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్వాసితుల కోసం సాగిన పోరాటంలో
మిలిటెంట్ గా కదిలింది. ఒకటా..రెండా..రాష్ట్ర వ్యాప్తంగా అసంఖ్యాకమైన
ప్రజపోరాటల్లో సోదర ప్రజాసంఘాలతో భుజం భుజం కలిపి పనిచేశారు
జైభారత్ కార్యకర్తలు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి