టిబెట్ సమస్యపై :

  టిబెట్ పైన చైనా దురాక్రమణను విస్పష్ట స్వరంతో ఖండించింది 'విజయవిహారం' పత్రిక. టిబెట్ లో మానవ హక్కుల హననాన్ని నిరసిస్తూ, టిబెట్ ప్రవాస ప్రభుత్వంతో చేయి కలిపి పనిచేసింది జైభారత్. టిబెటన్ల ఉద్యమానికి మన రాష్ట్రంలో  ఆశ్రయాన్ని కల్పించింది. అండగా నిలిచింది జైభారత్. టిబెటన్లతో కలసి, ధర్నాలు, ఊరేగింపులు, నిరసనలు, ప్రార్ధనా సమావేశాలు, కొవ్వొత్తుల ప్రదర్శనలు, సభల్లో జైభారత్ కార్యకర్తలు చురుకుగా పాల్గొన్నారు. ఖండాలు దాటి, దేశాలు పయనించి మన రాష్ట్రం చేరుకున్నటిబెట్ స్వతంత్ర్య జ్యోతికి టిబెటన్ కార్యకర్తలతో కలసి స్వాగతం పలికింది జైభారత్. టిబెట్ ఉద్యమాన్ని పాశవికంగా అణచి వేస్తూ.. చైనా ఒలంపిక్ క్రీడల్ని నిర్వహించడాన్ని నిరసిస్తూ... 'వన్ వరల్డ్ - వన్ డ్రీమ్ - ఫ్రీ టిబెట్' కార్యక్రమంలో పాల్గొన్నారు జైభారత్ కార్యకర్తలు.

కామెంట్‌లు లేవు: