దేశ భక్తీయుత విశాల విప్లవ వేదిక - జైభారత్


మత సామరస్యం , కులనిర్మూలన, సామాజిక పరివర్తన తదితర సమున్నత లక్ష్యాలతో భారతీయ విప్లవానికి కొనసాగింపుగా నిరంతరం పరిశ్రమిస్తున్న దేశ భక్తీయుత విశాల విప్లవ వేదిక - జైభారత్
మిత్రులారా!
ఈ దేశం మనందరిదీ. మన జీవితాల్ని మార్చేందుకు.., ఈ నేలను స్వర్గతుల్యం చేసేందుకు ఎందరెందరో మహానుభావులు ... తమ సర్వస్వాన్ని త్యాగం చేశారు. జీవితాల్ని ధారపోశారు. ఆ మహానీయుల విప్లవ వారసత్వానికి కొనసాగింపుగా , మన దేశంలోని కోట్లాది నిరుపేదల, అణగారిన కులాల, మహిళల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు నిరంతరం పరిశ్రమిస్తోంది- జైభారత్.
జైభారత్ ను సంక్షిప్తంగా పరిచయం చేసేందుకు,.. ఈ ఉద్యమానికి మీ తోడ్పాటును కోరేందుకు ఈ ప్రయత్నం.
'జైభారత్' ఎలా పుట్టింది?
జైభారత్
గురించి తెలుసు కోవాలంటే, మొదట 'విజయవిహారం' పత్రిక గురించి ప్రస్తావించుకోవాలి.
తిరగబడుతున్న జెనరేషన్ చేతిలో మెరుపు కాంతుల జ్యానఖడ్గం gaa ప్రసిద్దమైనది- 'విజయవిహారం' పత్రిక. సవాల్ ని ప్రేమించే తరాన్ని ఆవాహన చేసి 5 సంవస్తరాలకు పైగా ఆంధ్రదేశపు యువజనాన్ని ఉర్రుతలూపింది -'విజయవిహారం' పత్రిక . కనివిని ఎరుగని రీతిలో ... దాడుల్ని, అణచి వెతని, అక్రమ కేసుల్ని,అరెస్ట్ లని ఎదుర్కొంది విజయవిహారం పత్రిక. మతవిద్వేశం, కుల అహంకారం, అవినీతి, అక్రమ దుర్గాలకు దుస్స్వప్నమై నిలిచింది, వేరపెరుగని అక్షర ra వెలిగింది- 'విజయవిహారం' పత్రిక.

'విజయవిహారం' అక్షరాలకు స్పందిచిన యువతరం పాటకులే జైభారత్ సంస్థను నిర్మించుకున్నారు. 'విజయవిహారం' నిబద్దమైన విలువలను, ఆదర్శాలను ఆచరణకు తెచ్చే దేశభక్తి యుత విశాల వేదికగా మలుచుకున్నారు.
మత విద్వేషపు జ్వాలలు ఉవ్వెత్తున ఎగసి, గుజరాత్ లో వేలాది మానవ ప్రాణాలు మాడిపోతున్న ఉద్రిక్త సమయం లో.. గాంధీజీ, వివేకానంద, ఖాన్అబ్దుల్ గఫార్ ఖాన్ వంటి ఎందరెందరో మహానీయుల ఆశయాల వారసత్వ పతాకాన్ని చేతబూని -2002 మే 19న ఆవిర్భవించింది జైభారత్.

చిన్న మొలకే -పటిష్టమైన, నిబద్దమైన, విన్నూత్న, విప్లవయువజన వ్యవస్టగా ఎదిగింది!

ఇవ్వాళా మనం ఎదుర్కొంటున్న అనేకానేక సమస్యలకి, మూసపద్దతిలో కాకుండా, ... చిత్తసుద్ధితో ... సమగ్రమైన పరిష్కారం కోసం అన్వేషిస్తున్న, మాట్లాడుతున్న సంస్థ ఏదైనా ఉందా?

వివేకానందుడు, గాంధిజీ, బాబాసాహెబ్ అంబేత్కర్, నారాయణగురు, భగత్ సింగ్, ఖాన్అబ్దుల్ గఫార్ ఖాన్, లోహియ ...వంటి అమరులు,

  • మాహొన్నతులు ఎందరెందరో ...కలలు కన్నా భారతదేశాన్ని సాకారం చేసేందుకు శ్రమిస్తున్న సంస్థ ఉందా?
    ఉపనిషత్తులు, బుద్దుడు, కబీర్, నానక్, రామకృష్ణ పరమహంస, షిర్డీ సాయిబాబా ...ప్రవచించిన మహితాదర్సాల ప్రాతిపదికగా మన సమాజాన్ని,దేశాన్ని నిర్మించేందుకు యువతను సమీకరిస్తున్న సంస్థ ఉందా?
    'ప్రయోజనా'న్ని గురించే కాదు, దేశం పట్ల మనకున్న 'కర్తవ్యం' గురించి మాట్లాడుతున్న సంస్థ,
    'పలితా' న్ని గురించి మాత్రమేకాదు, 'ఆత్మార్పణ'ను ఆదర్శంగా చూపే సంస్థ,
    'విజయం' గురించి మాత్రమేకాదు, 'విలువల' కోసం పోరాడాలని ఉద్బోదించే సంస్థ... ఏది? ఏది?
    ఈ ప్రశ్నలకు సమాధానం-జైభారత్. ఒక పత్రిక పాటకులు స్థాపించుకున్న వేదికగా ప్రారంభమైన .., ఇవ్వాళ రాష్ట్రంలోని అత్యంత నిబద్ధమైన, పటిష్టమైన క్యాడర్ కలిగిన ప్రజా సంస్థగా ఎదిగింది -జైభారత్. నిరుపేదల, స్త్రీల,దళిత, బలహీన వర్గాల, గిరిజనుల ప్రయోజనాల కోసం రాజి లేకుండా పోరాడే సంస్థగా, మతసామరస్యాన్ని, ప్రజల మద్య ఐక్యతను నిర్మించేందుకు కట్టుబడిన సంస్థగా,సమగ్రమైన సైద్దాంతిక అవగాహనతో, నిబద్ధమైన ఆచరణతో- భారతీయ విప్లవానికి కొనసాగింపుగా ముందడుగు వేస్తోంది-జైభారత్.
    జైభారత్ తిరుగులేని ఆచరణ
    జైభారత్ ఉద్యమంలోని నిజాయితీని, ఆశయ దీక్షని ప్రస్పుటంగా చాటింది జైభారత్ కార్యాచరణ. ఆ నిరుపమాన ప్రస్తానంలోని కొన్ని ముఖ్యమైన మైలురాళ్ళు ఇవిగో :

మత విద్వేషంపై పోరాటం, 5 లక్షల శాంతి ప్రతిజ్ఞల సేకరణ :గాంధీజీ రూపొందించిన సమైక్యతా ప్రతిజ్ఞపై జైభారత్ కార్యకర్తలు 5 లక్షలకు పైగా సంతకాలను సేకరించడం ఒక మహొజ్వలమైన చరిత్ర. రంగుల తేడాలను పట్టించుకోలేదు జైభారత్, ప్రజల మధ్య చిచ్చుపెట్టె ఏ మతోన్మాదాన్నైనా ఎదిరించింది. మతసామరస్యాన్ని కాపాడేందుకు బలమైన క్యాంపెయిన్ చేసింది.

మతకల్లోలాల్లో సర్వస్వం కోల్పోయిన భాదితుల్ని అనేక సందర్భాల్లో ఓదార్చింది, నిజాయితీతో ఆదుకుంది. మతాలకతీతంగా సాటివారిని ఆదుకున్న మానవతా మూర్తులను సత్కరించింది. విభిన్న మతాలకు చెందిన మతగురువుల్ని, ఆచార్యులని ఆధ్యాత్మిక వేత్తల్ని ఒకే వేదికపైకి తీసుకువచ్చి.. సమైక్యతా సందేశాన్ని వినిపించింది. 'మతోన్మాదానికి క్విట్ ఇండియా చెబుదాం' అనే నినాదంతో భారీ ఎత్తున్న మతసామరస్య సమ్మేళనాలను నిర్వహించిది. ఊరేగింపులు తీసింది. సామరస్యం కోసం కృషి చేసిన విశిష్ట వ్యక్తులకు గాంధిజీ పేరిట పురస్కారాలు ఇచ్చింది.బాంబు పేలుళ్లను నిరసిస్తూ ప్రజల్ని కదిలించింది.విద్వేషాలను వ్యతిరేకిస్తూ నిరసిస్తూ మానవహారాన్ని నిర్మించిది. పండుగలను మతాలకతీతంగా జరుపుకునే... సంప్రదాయాన్ని ఆచరణకు తెచ్చేందుకు అడుగులు వేసింది. గాంధిజీ బాటలో నడచి...సమైక్యత కోసం 'ఖుదాయి ఖిద్మత్ గార్' ఉద్యమాన్ని నిర్మించి మహానీయుడు ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ పేరుని తన కేంద్ర కార్యాలయానికి పెట్టుకుంది జైభారత్. ముంబై నగరంలో ఇటీవల జరిపిన మతోన్మాద టెర్రరిస్ట్ దాడిని ఖండిస్తూ, అమర జవాన్లకు నివాళులర్పిస్తూ ఆంధ్రప్రదేశ్ శాఖ రాష్ట్రమంతటా.. 2008 డిసెంబర్ 2న కొవ్వొత్తుల ప్రదర్శనను నిర్వహించింది. మహారాష్ట్ర శాఖ షోలాపూర్ తదితర ప్రాంతాల్లో సభలు జరిపింది..
గాంధీ జయంతి, షిరిడి సాయిబాబా వర్ధంతిని పురస్కరించుకొని.. ప్రతీ ఏటా అక్టోబర్ నెలలో జిల్లాల్లోమండలాల్లో సైతం...ఒక మహోద్యమంగా పెద్ద ఎత్తున మతసామరస్య సమ్మేళనాలను నిర్వహిస్తోంది. 'జైభారత్' . 1927 లో కాకోరి వీరులు 'రామ్ ప్రసాద్ బిస్మిల్', అష్ఫాఖుల్లా ఖాన్' అమరులైన దినం డిసెంబర్ 19 న ప్రతి ఏటా హిందూ - ముస్లిం ఐక్యత దినంగా జైభారత్ ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర శాఖలు పెద్దఎత్తున జరుపుతున్నాయి.
'విజయవిహారం' పైన దాడిని నిరసిస్తూ : మతవిద్వేషానికి, కులాహంకారానికి, అవినీతి, అక్రమాలకూ సింహస్వప్నంగా నిలిచిన 'విజయవిహారం' పత్రిక పైన ముష్కర పోలీస్ కుట్రలు విరుచుకు పాడినప్పుడు ప్రతి ఘటించింది 'జైభారత్'. ఎడిటర్ అక్రమ అరెస్టును ప్రతిఘటిస్తూ కమీషనరేట్ ను ముట్టడించింది. ఎడిటర్ ను విడిపించుకుంది. పోస్ట్ కార్డుల, పోస్టర్లద్వారా ప్రచారం చేసింది. 'విజయవిహారం' పైన కుట్రల్ని నిరసిస్తూ ప్రతిష్టాత్మక మైన రీతిలో...'రక్షణ భేరి ' వంటి భారీ సభని నిర్వహించింది. 'విజయవిహారం' జర్నలిస్టు, 'జైభారత్' ప్రధాన కార్యదర్శి కిడ్నాప్ కి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఉవ్వెత్తున ఉద్యమాన్ని నిర్వహించింది. బందీ ప్రదర్శినలని, కొవ్వొత్తుల ఊరేగింపుల్నిరక్తదానల్ని, శవయాత్రల్ని నిర్వహించిది. ప్రజాసంఘాల, మేధావుల, ప్రజాతంత్రవాదుల అబిప్రాయాన్ని కూడగట్టింది.

  • పైవేటు రంగంలో రిజర్వేషన్లు : పైవేటు రంగంలో రిజర్వేషన్లు
    పైవేటు రంగంలో రిజర్వేషన్లు :

కామెంట్‌లు లేవు: