ఉచిత కంప్యూటర్ + స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షణను

ఇప్పటికే 7 వేలకు పైగా నిరుపేద, ఎస్సీ, ఎస్టీ, బీసి.  విద్యార్ధులకు కంప్యూటర్,

స్పోకెన్ ఇంగ్లీష్ (భవిష్యత్తులో 1,00,000  మంది విద్యార్ధులకి లక్ష్యం):

సాహుమహరాజ్ పేరిట 3 నెలల ఉచిత కంప్యూటర్ శిక్షణ కార్యక్రమానికి, కీర్తి

చక్ర పందిళ్లపల్లి శ్రీనివాస్ పేరిట ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షణ కార్యక్రమానికి

రూపకల్పన చేసింది జైభారత్. రాష్ట్రంలో ఇప్పటికే ..13 కేంద్రాల్లో

(మలికిపురం, నాయుడుపేట, మంచిర్యాల (2 బ్యాచ్ లు), శ్రీకాలహస్త్రి,

గోదావరి ఖని, సంగారెడ్డి,గూడూరు, రాజమండ్రి, కోటవురట్ల) 7 వేల మందికి

పైగా ఎస్సీ, బీసి, ఎస్టీ, ఇబీసి విద్యార్ధులకి, చక్కటి సదుపాయాలతో,

నిపుణులైన ఫ్యాకల్టితో అపూర్వమైన క్రమశిక్షణతో, ఉచిత కంప్యూటర్ +

స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షణను అందించింది.కోర్సు పూర్తి చేసిన విద్యార్ధులకు

సర్టిఫికెట్స్ ప్రధానం చేసింది. రాష్ట్రమంతటా మహా యజ్ఞంగా ,

మహోద్యమంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి.. నిబద్దతను

నిరూపించుకుంది జైభారత్. త్వరలోనే .. మరో 20  కేంద్రాలలో శిక్షణ

ప్రారంబించేందుకు సన్నాహాలు చేస్తుంది.సమీప భవిష్యత్తులోలక్ష మందికి

పైగా నిరుపేద విద్యార్ధులకు కంప్యూటర్, స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షణ అందించాలని

సంకల్పించింది జైభారత్.

1 కామెంట్‌:

PALERU చెప్పారు...

soon i m coming to India...i will be with jaibharat for every step from then...